మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం దేవర భీమనపల్లికి చెందిన దళితబిడ్డ జిల్లా రామలింగం కు కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా ప్రాణం. ఎన్నిక ఏది వచ్చినా తను ఓటు వేసేది టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మాత్రమే. వయసు మీదపడడం, బరువైన పని చేసే పరిస్థితి లేకపోవడంతో బతుకుదెరువులో భాగంగా ఐదేళ్ల క్రితం రామలింగం స్కూటీపై కూరగాయలు, ఎండు చేపలు అమ్మడాన్ని అలవాటు చేసుకున్నాడు.
మునుగోడు నియోజకవర్గం నుండి దేవరకొండ వరకు రోజుకు ఒక గ్రామంలో తిరుగుతూ అమ్ముతుంటాడు. స్కూటీకి అమర్చిన మైకులో నిరంతరం టీఆర్ఎస్ పార్టీ పాటలనే పెట్టుకుంటాడు. దామెర భీమనపల్లిలో ఈ రోజు (గురువారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో జిల్లా రామలింగం ఎదురుపడ్డారు. వినూత్నంగా ఆలోచించి జీవనోపాధి పొందుతున్న విషయం తెలుసుకుని రామలింగంను మంత్రి అభినందించారు. జిల్లా రామలింగం లాంటి టీఆర్ఎస్ , కేసీఆర్, తెలంగాణ అభిమానులే టీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ తెచ్చి, తమ ప్రాంతానికి తాగునీరు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ అన్నా తనకు ఇష్టమని , కేసీఆర్ మాత్రమే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాడని జిల్లా రామలింగం అన్నారు
Also Read : కాంగ్రెస్,బిజెపిలకు మునుగోడుతో గుణపాఠం తలసాని