Wednesday, April 16, 2025
HomeTrending Newsబాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏ. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్  మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు గీతారెడ్డి, దామోదర్ రాజ నరసింహ, షబ్బీర్ ఆలీ, పార్టీ ప్రచార కమిటి ఛైర్మన్ గా నియమితులైన మధు యాష్కి గౌడ్, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్ధన్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

అంతకుముందు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడినుంచి ర్యాలీగా నాంపల్లి చేరుకొని దర్గా వద్ద దట్టీ సమర్పించారు. అనంతరం గాంధీ భవన్ చేరుకొని పార్టీ సీనియర్ నేతల సమక్షంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్