Saturday, November 23, 2024
Homeసినిమా'జిన్నా' అటువైపు వెళ్లకుండా ఉండాల్సిందేమో!

‘జిన్నా’ అటువైపు వెళ్లకుండా ఉండాల్సిందేమో!

Movie Review: మంచు విష్ణు హీరోగా ఆయన సొంత బ్యానర్లో ‘జిన్నా‘ సినిమా నిర్మితమైంది. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. కొంత కాలంగా హీరోగాను .. నిర్మాతగాను ఆశించినస్థాయి రిజల్టును అందుకోలేకపోయిన విష్ణు, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘జిన్నా’ చేశాడు. యాక్షన్ కామెడీ సినిమాలతో తనకి విజయాలను అందిస్తూ వచ్చిన జి. నాగేశ్వర రెడ్డి పట్ల గల  నమ్మకంతో ఆయన దగ్గరున్న కథను తీసుకున్నాడు. మొత్తం సినిమాపై కోన వెంకట్ పర్యవేక్షణ ఎలానూ ఉంది;. అందువలన ఈ సారి గట్టి హిట్ కొట్టనున్నట్టుగా ప్రమోషన్స్ లో విష్ణు చెప్పాడు. తన కెరియర్లో బెస్ట్ ఆల్బమ్ ను అనూప్ రూబెన్స్ ఇచ్చినట్టుగా మరీ మరీ చెప్పాడు.

‘జిన్నా’ సినిమా తిరుపతికి సమీపంలోని ఒక విలేజ్ లో, హీరో ..  హీరోయిన్స్ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. ఈ కథలో ఇద్దరు హీరోయిన్స్. ఒకరు రేణుక (సన్నీ లియోన్) అయితే .. మరొకరు పచ్చళ్ల స్వాతి ( పాయల్). చిన్నప్పుడు ఆ ఊరు నుంచి అమెరికా వెళ్లిపోయిన రేణుక, యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత శ్రీమంతురాలిగా ఆ ఊరుకు వస్తుంది. కష్టాల్లో ఉన్న బాబాయ్ (నరేశ్) ను గట్టెక్కిస్తుంది. ‘జిన్నా’ ను పెళ్లి చేసుకోవాలనేది ఆమె ఆశ. అప్పటికి అతను పచ్చళ్ల స్వాతిని ప్రేమిస్తూ ఉంటాడు. టెంట్ హౌస్ బిజినెస్ సరిగ్గా సాగక .. తండ్రిలా ఆ ఊరికి ప్రెసిడెంట్ కావడానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటాడు.

తన అప్పు చెల్లించమనీ .. లేదంటే తన చెల్లిని పెళ్లి చేసుకోమని లోకల్ రౌడీ గోవర్ధన్ జిన్నాకు నెల రోజులు గడువు పెడతాడు. మరో వైపున ప్రెసిండెంట్ పదవిని జిన్నా బాబాయ్ (రఘు బాబు) కొట్టేయాలని చూస్తుంటాడు. రేణుక నుంచి డబ్బు కొట్టేయాలనేది జిన్నా ఆలోచన. డబ్బు కోసం ఆమెను లేపేయాలనేది ఆమె బాబాయ్ ప్లాన్. అందుకోసం ఎవరు ఏం చేస్తారు? పర్యవసానంగా ఎలాంటి  పరిణామాలను ఎదుర్కొన్నారు? అనేది కథ. ఫస్టాఫ్ అంతా కూడా యాక్షన్ కామెడీ మార్కుతోనే ఈ కథ నడుస్తుంది. కథనం మందగించినా .. ఏదో ఫ్లోలో వెళుతుందిగా అన్నట్టుగా ప్రేక్షకులు ఫాలో అవుతుంటారు.

సరిగ్గా ఇంటర్వెల్ నుంచి కథ మలుపు తిరుగుతుంది. యాక్షన్ … కామెడీకి సస్పెన్స్ థ్రిల్లర్ తోడవుతుంది. కథ మలుపు తిరిగింది అనడం కంటే ట్రాక్ తప్పింది అనడమే కరెక్టేమో అనిపిస్తుంది. యాక్షన్ ,.. కామెడీ .. ఫైట్లు .. డాన్సులు విష్ణు చాలా బాగా చేశాడు. అయితే గ్లామరస్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నప్పటికీ వాళ్ల వైపు నుంచి మాస్ ఆడియన్స్ కి ఒరిగిందేమీ లేకపోవడం, అసంతృప్తిని కలిగించే విషయం. కథాకథనాల పరంగా కాస్త అసంతృప్తితో ఉన్న ఆడియన్స్ కి, ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేవి అనూప్ పాటలే. సంగీతమే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పక తప్పదు. ఇంటర్వెల్ తరువాత కథ అదే యాక్షన్ కామెడీకి కట్టుబడి సాగితే బాగుండేదేమో అనుకుంటూనే, థియేటర్స్ లో నుంచి సగటు ప్రేక్షకుడు బయటికి వస్తాడు.

Also Read : ఆడియన్స్ కి కావాల్సినంత కథనే లేదు! 

Also Read : అటు యుద్ధం .. ఇటు ప్రేమ .. మధ్యలో ‘సీతా రామం’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్