Sunday, November 24, 2024
HomeTrending Newsరెండోస్థానం కోసమే కాంగ్రెస్, బిజెపిల పాట్లు: జగదీష్ రెడ్డి

రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బిజెపిల పాట్లు: జగదీష్ రెడ్డి

ప్రధాని మోదీ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ పూర్తిగా తగ్గి పోవడంతో బిజెపి,కుయుక్తులు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.ఆ భయం తోటే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను అస్థిరత పరిచే కుట్రలకు తెర లేపారని ఆయన మండిపడ్డారు.దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కు తెర లేపినమునుగోడు ఉప ఎన్నికల నేపద్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ శక్తిగా మారడంతో కమలనాథులకు వణుకు మొదలైందాన్నారు. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిలువరించేందుకే మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారని ఆయన ఆరోపించారు.
కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. బిజెపి ఎత్తుగడలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఒక బాగమన్నారు.మునుగోడులో కొత్తగా పర్యటించేది అమిత్ షా,నడ్డా,బిజెపి కి చెందిన కేంద్రమంత్రులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ కాలం నుండే మునుగోడు పై ప్రత్యేక దృష్టి సారించడం తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో జరిగిన సభలలో మునుగోడు అంశాన్ని ఉద్యమ నేత గా నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఆరు ఏండ్ల వ్యవధిలోనే ఫ్లోరోసిస్ మహమ్మరిని పారద్రోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.తెలంగాణ సమాజం కోవర్ట్ రాజకీయాలను కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో బిజెపిని నిలువరించాలి అన్నదే వామపక్షాల అభిమతమన్నారు. దేశానికి ప్రమాద కారిగా మారిన బిజెపిని ఎదుర్కొనే క్రమంలోనే మునుగోడులో టి ఆర్ యస్ కు వామపక్షాలు మద్దతు నిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సరిహద్దు రాష్ట్రాలను దాటుకుంటూ ఢిల్లీ,కాశ్మీర్ దాకా చేరాయన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా బిజెపి ఎలుబడి రాష్ట్రాలలో తెలంగాణ పధకాలు చర్చనీయాంశంగా మారడంతో బిజెపికి కంటగింపుగా మారిందన్నారు. దానికి తోడు యావత్ భారత దేశంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించడం కుడా ఆ కంటగింపులో బాగమైందన్నారు. దానికి తోడు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తుండడంతో కేంద్రం తట్టుకోలేక అనేక అవరోధాలు సృష్టిస్తోందన్నారు.వీటన్నింటి దృష్టి ని మరల్చి గలివాటం గా గెలిచిన హుజురాబాద్, దుబ్బాకలను పోల్చుకుని తెలంగాణా లో ఎదో బలం ఉందనే భ్రమలలో బిజెపి మునుగోడు లో ఉప ఎన్నికను బలవంతంగా రుద్దిందని ఆయన దుయ్యబట్టారు.
అయినా అక్కడ బిజెపి, కాంగ్రెస్ లు రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నిక లాంఛనమే అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ధన ప్రభావం పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బిజెపి కి అక్కడ లీడర్ లేడు, క్యాడర్ లేడు. పైగా బిజెపి నుండి బరిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్టు కోసం పార్టీ మారారు అని ఆయన స్వయంగా వెల్లడించడంతో ఈ దుస్థితికి చేరిందన్నారు. సాదారణ ఎన్నికల పై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాలు ఎప్పటికైనా గీటు రాయే అని ఆయన చెప్పారు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమించి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కారిస్తామన్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఇన్ని సమస్యలు పేరుక పోవడానికి రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. కల్యాణలక్ష్మీ/షాధి ముబారక్ చెక్ లను నిర్ణిత సమయంలో లబ్ధిదారులకు అంద జేయక పోవడంతో అవి మురిగి పోయాయని ఆయన గుర్తుచేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చొరవతో వాటిని రేనివల్ చేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక మూడోది అని హుజుర్నగర్, నాగార్జున సాగర్ లలో సాధించిన విజయాల వరుసలోనే మునుగోడు ఉంటుందన్నారు. మునుగోడులో గెలిచి హ్యాట్రిక్ సాధించి తీరుతామని ఆయన గట్టిగా ధీమా వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ శాశ్వత నివారణ కు వరద కాలువలే పరిష్కరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో డిండి ఎత్తిపోతల పధకం తో సహా చర్లగుడెం, శివన్నగూడెం,లక్ష్మపురం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

Also Read : పూటకో మాట రాజగోపాల్ నైజం జగదీష్ రెడ్డి విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్