జనసేన ట్విట్టర్ ప్రశ్నలకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదంటూ హితవు పలుకుతూనే తమ కార్యాలయం మీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉందంటూ బదులిచ్చారు. గతవారం మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన మూడు పెళ్ళిళ్ళ వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించి వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలంటూ నిన్న నోటీసులు జారీ చేసింది. దీనిపై జనసేన నేడు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చి 18 ప్రశ్నలతో కూడిన ట్వీట్ లను సంధించింది. దీనికి వాసిరెడ్డి పద్మ స్పందించారు.
“ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ‘మహిళా కమిషన్’ ఉంది. మీ పార్టీ అధినేత ఇప్పటికైనా కళ్ళుతెరిచి ‘మహిళ’కు క్షమాపణ చెబితే.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే..” అంటూ బదులిచ్చారు. దీనికి జతగా నిన్న పంపిన నోటీసును కూడా షేర్ చేశారు.
Also Read : అప్పుడేం చేస్తోంది మహిళా కమిషన్: జనసేన