కాకినాడలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) క్యాంపస్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణి శాఖమంత్రి పియూష్ గోయెల్ ప్రారంభించారు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా తర్వాత మూడో క్యాంపస్ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీదిరి అప్పల రాజు, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, జీవీఎల్ నరసింహారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
వాణిజ్య రంగంలో ఆంధ్ర ప్రదేశ్ మరింత ముందంజ వేయడానికి ఇది తోడ్పడుతుందని, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేటాయించి ప్రారంభించడం ప్రధాని మోడీ గారికీ రాష్ట్రంపై గల ప్రత్యేక శ్రద్దకు నిదర్శనమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.