పుంగనూరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించి పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ప్రారంభించారు . ఈ పథకం ద్వారా పశుసంవర్ధక శాఖ లింగ నిర్ధారణ వీర్య నాళీకలు సఫరా చేయనున్నారు. తద్వారా 90 శాతం పెయ్య దూడలు, 10 శాతం మగ దూడలు జన్మించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. పుంగనూరు నియోజకవర్గం లోని చౌడేపల్లి, సోమల, పుంగనూరు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ ను మంగళవారం నుండి ప్రారంభించనున్న నేపద్యంలో, సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు