Saturday, November 23, 2024
HomeTrending Newsభారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం

భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు నవంబర్ 4 న ఒక రోజు విరామం ప్రకటించారు. నవంబర్ 5 న తెలంగాణలోని మెదక్ నుండి మళ్లీ యాత్ర ప్రారంభిస్తాము” అని భారత్ జోడో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో‌ ప్రకటించారు. యాత్రను సమన్వయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పుల్‌కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ సమీపంలో రాహుల్ బస చేశారు. ఈ రోజు (శుక్రవారం) మేధావులు, వివిధ వర్గాల నాయకులతో పాటు.. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో రాహుల్ భేటీ కానున్నారు. రేపటి నుంచి సాగే భారత్ జోడో యాత్రలో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు రాహుల్ గాంధి వెంట జోడో యాత్రలో పాల్గొంటారు.

ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించడానికి ముందు తెలంగాణలో దాదాపు 375 కి.మీ.ల దూరం సాగనుంది. ఎన్నికల పోలింగ్ జరగనున్న తెలంగాణలోని 19 అసెంబ్లీ మరియు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ రాహుల్ పాదయాత్ర సాగుతుంది. దక్షిణాదిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రధానమైన తెలంగాణలో పుంజుకోవడానికి రాహుల్ గాంధీ శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రచారం సందర్భంగా క్రీడా కారులు, వ్యాపారులు, వినోద రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు మరియు వివిధ సంఘాల నాయకులను కలుస్తున్నారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.

Also Read : హైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్