టి20పురుషుల వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు సెమీస్ కు దాదాపు చేరుకుంది. ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు అద్భుతాలతో గెలిస్తే తప్ప న్యూజిలాండ్ రేసులో నిలబడినట్లే. నేడు జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి నెట్ రన్ రేట్ ను కూడా మెరుగుపర్చుకుంది.
అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్-61; ఫిన్ అల్లెన్-32; డెరిల్ మిచెల్-31; డెవాన్ కాన్వే-28 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్ జోసువా లిటిల్ హ్యాట్రిక్ సాధించడం విశేషం 19వ ఓవర్లో 2,3,4 బంతుల్లో వరుసగా విలియమ్సన్, నీషమ్, శాంట్నర్ లను పెవిలియన్ పంపాడు. లిటిల్ తో పాడు డెలానీ కి రెండు; మార్క్ అడైర్ కు ఒక వికెట్ లభించింది.
ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి వికెట్ కు 68 పరుగులు జోడించినా ఫలితం లేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. పాల్ స్టిర్లింగ్-37; అండ్రూ బల్బిర్నీ-30; జార్జ్ డాక్రెల్-23…. మాత్రమే రాణించారు. ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేయగలిగింది.
కివీస్ బౌలర్లలో ఫెర్గ్యుసన్ మూడు; సౌతీ, శాంట్నర్, ఇష్ సోది తలా రెండు వికెట్లు పడగొట్టారు.
35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.