తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. NRI శాఖ కూడా పెడతా అని కెసిఆర్ అప్పుడు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన…పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గల్ఫ్ బాధితుల సమస్యలపై మాట్లాడాడు. ఖతార్ దేశం నుంచి వేల మంది తెలంగాణ కార్మికులను బయటకి పంపిస్తున్నారని, ఇప్పటివరకు 25 వేల మందిని బయటకు పంపారని తెలిపారు. ఇంత జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని, గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది కెసిఆర్ ప్రభుత్వమని మధు యాష్కీ విమర్శించారు. తెలంగాణలో NRI పాలసీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా NRI శాఖ తీసేసిందని, ఖతార్ నుండి వచ్చే కార్మికులకు పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి..ఇప్పటి వరకు నియామకాలు లేవని మధు యాష్కీ మండిపడ్డారు. తెలంగాణ లిక్కర్ పాలసీనే పంజాబ్, ఢిల్లీ పాలసీగా కాపీ కొట్టిందన్నారు. బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళక కట్టబెట్టారన్నారు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణలొనే ఉందన్నారు. డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ అయ్యిందని, డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నిక సీరియస్ గానే తీసుకుంటుందని, మునుగోడులో అందరూ కలిసి పని చేశారన్నారు. అయితే కంటిన్యూ గా ఓడిపోవడం విచారకరమని, తెలంగాణలో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. దన ప్రభావం ఒక్కటే ఉండదన్న మధు యాష్కీ ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాద్యత లు తీసుకుంటారన్నారు. మునుగోడుపై త్వరలోనే సమీక్ష జరుగుతుందని…సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు ఉంటాయన్నారు. రాహుల్ గాంధి భారత్ జొడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడిందని.. ఇది మంచి పరిణామమని మధు యాష్కీ హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు మాతో ఉండే..ఇప్పుడు లేరని, టీడీపీ కూడా ఓట్లు పెంచుకునే పనిలో ఉందన్నారు. పార్టీ క్రమశిక్షణకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరగాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ అని 2013లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడేదో బీజేపీ చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వచ్చినప్పుడే.. trs గొడవ చేస్తుందని, ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ కాళ్ళ మీద పడి వస్తారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు అడుతున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకే trs.. బీజేపీ పంచాయతీ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని, గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమేనని, ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు.
Also Read : ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ?