Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో కొత్తగా వెయ్యి మత్స్యకార సోసైటీలు

తెలంగాణలో కొత్తగా వెయ్యి మత్స్యకార సోసైటీలు

ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కారుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు వారి డిమాండ్ పట్టించుకోలేదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 1000 మత్స్య సహకార సంఘాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. • హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి లో ఈ రోజు మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కొత్త  మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటుపై సమీక్ష చేశారు.

సమీక్షలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

అర్హులైన ప్రతీ మత్స్య కారుడికి సంఘ సభ్యత్వం పొందడం హక్కు. అందుకే ప్రభుత్వం కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేసి మత్స్య కారులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు‌ చేసే 650 మత్స్య సహకార సంఘాల్లో సభ్యులకు నైపుణ్య పరీక్షలు పూర్తయ్యాయి. మరో 334 సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. 18ఏళ్లు నిండిన మత్స్య కారులకు మార్కెటింగ్ సోసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయంచడం జరిగింది. దీని వల్ల 18ఏళ్లు నిండిన మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారు.

650. మత్స్య సహకార సంఘాల్లో 13 వేల 900 మందికి‌ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మరో 334 సంఘాల్లో సభ్యత్వం కోసం నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సంఘాల్లో మరింత మంది మత్స్యకారులకు సభ్యత్వం లభించనుంది. మూడు నెలల్లో ఈ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని మత్స్య శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశం. సభ్యత్వ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశం. రాష్ట్రంలో ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోంది. చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. దీని వల్ల నీటి వనరులు పెరిగాయి. వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది.
నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఫిషరీస్ సోసైటీల్లో ఎంపిక చేయడం జరిగింది. కాని ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి  ఉందీ, పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చు. కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయి. సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుంది. రుణ సౌకర్యం సుళువుగా లభిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు సభ్యులంరికీ అందరికీ వర్తిస్తాయి. 33 జిల్లాల్లో మత్ససహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలి. భవిష్యతులో మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన పథకాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తెలంగాణలో మత్స్యకారులకు లబ్ధి చేకూర్చుతోంది. మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా ఇస్తున్నాం. తద్వారా మత్స్యకారుల కుటుంబానికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపంద పెరిగింది. కేజ్ కల్చర్ పద్ధతి ద్వారా చేపల పంపంకం రాష్ట్రంలో చేపడుతున్నం. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పైనాన్స్ రామకృష్ణారావు , స్పెషల్ సెక్రటరీ యానిమల్ హజ్బెండరీ అదర్ సిన్హా, ఫిషరీస్ కమిషనర్ లచ్చిరాం నాయక్, డైరీ డెవలెప్మెంట్ ఛైర్మన్ సోమ భరత్ కుమార్, ఫిషరీస్ డిపార్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్