Saturday, November 23, 2024
HomeTrending Newsనిఘా వర్గాల ఉదాసీనత...ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

నిఘా వర్గాల ఉదాసీనత…ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలిసినా తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో వాపోయారు.

“కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలో ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. మరమ్మతులు చేసి అదే వాహనాన్ని మళ్లీ ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయింది. గన్మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అప్టస్గంజ్ వద్ద మరోసారి ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇచ్చారు” అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.

Also Read : ఎమ్మెల్యే రాజసింగ్ కు బెయిల్ మంజూరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్