క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి అందించే అవార్డులను కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బర్మింగ్ హాం లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో మూడు స్వర్ణాలతో పాటు మొత్తం నాలుగు పతకాలు సాదించిన ఆచంట శరత్ కు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించింది. కామన్ వెల్త్ లో పతకాలు సాధించిన ఎల్దోస్ పాల్ (పురుషుల ట్రిపుల్ జంప్); అవినాష్ సబలే (పురుషుల మూడు వేల మీటర్ల స్తీపెల్ చేజ్); లక్ష్య సేన్, (బాడ్మింటన్); నిఖత్ జరీన్ (బాక్సింగ్), తెలుగమ్మాయి శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్) లను అర్జున అవార్డు వరించింది. వీరితో పాటు హెచ్ ఎస్ ప్రణయ్(బాడ్మింటన్); సుశీలా దేవి( జూడో), సాక్షి కుమారి (కబడ్డీ) లు కూడా అర్జున అవార్డు పొందిన వారిలో ఉన్నారు.
క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించే ద్రోణాచార్య అవార్డులు…
రెగ్యులర్ కేటగిరిలో… జీవన్ జ్యోత్ సింగ్ తేజ (అర్చరీ); మహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్); సుమ సిద్దార్థ్ (పారా షూటింగ్); సుజీత్ మాన్ (రెజ్లింగ్)
లైఫ్ టైమ్ కేటగిరిలో….దినేష్ జవహర్ లాడ్ (క్రికెట్); బిమాల్ ప్రఫుల్లా ఘోష్ (ఫుట్ బాల్); రాజ్ సింగ్ (రెజ్లింగ్) కు దక్కింది.
ధ్యాన్ చంద్ లైఫ్ టైం అవార్డులు… అశ్విని అక్కుంజి (అథ్లెట్స్); ధర్మవీర్ సింగ్ (హాకీ); బీసీ సురేష్ (కబడ్డీ); నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెట్స్) లకు దక్కాయి.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ.. అమృత్ సర్ లోని గురునానక్ యూనివర్సిటీ కి దక్కింది.