కేసీఅర్ ముఖ్యమంత్రి కాదు.. పెద్ద 420 అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాను మోసం చేసిన మోసగాడు కేసీఅర్ అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో బాగంగా మంగళవారం కరీంనగర్ 1 టౌన్ సర్కిల్ వద్ద YSRTP నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… కెసిఆర్..మంత్రి గంగుల..బండి సంజయ్ లపై పదునైన విమర్శలు సంధించారు.
వైఎస్ షర్మిల ఆరోపణలు ఆమె మాటల్లోనే…
కేసీఅర్ 8 ఏళ్లుగా ఉండి చేసింది ఎంటి..? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే జిల్లాలో ఉంది. ఈ జిల్లాకు ప్రయోజనం మాత్రం లేదు. ఇక్కడ నుంచి ఆయన ఫామ్ హౌజ్ కి తరలించు పోయారు. ఈ జిల్లాలో చిన్న తరహా ప్రాజెక్ట్ ఒక్కటి కూడా కట్టలేదు. వైఎస్సార్ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే..కేసీఅర్ ఈ జిల్లాలో ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చారా..? నిధులు అన్నారు..నీళ్ళు అన్నారు.. ఏమి దక్కలేదు
కరీంనగర్ కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాదు.. రంగుల కమలాకర్. కరీంనగర్ కి డాన్ అయి కూర్చున్నాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు… గంగుల ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడు. గ్రానైట్ మాఫియా..ఇసుక మాఫియా..గుట్కా మాఫియా..భూ కబ్జాలు. డాన్ అంటే మొత్తం మాఫియా చేయడమే. డబ్బు సంపాదన సింగిల్ అజెండా. ఈయన ఇంట్లో ఈడి సోదాలు కూడా చేసింది. కట్టలు కట్టలుగా హవాలా డబ్బులు దొరికాయట కదా. గ్రానైట్ మైనింగ్ లో 350 కోట్లు కేంద్రానికి కట్టాల్సి ఉందట. దోపిడీకి ఇదే నిదర్శనం కాదా. ఈడి వచ్చి నోటీసులు ఇస్తే.. కనీసం ఈ మంత్రి పై చర్యలు లేవు. అవినీతి ఉందా..? లేదా ..? అని రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలి కదా..? పెద్ద దొరకు, చిన్న దొరకు ఇవ్వాల్సిన కమీషన్ కు అందుతున్నాయి. అందుకే ఈ రంగుల కమలాకర్ పై కేసులు లేవు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రాష్ట్రం లో నెంబర్ 1. మొత్తం ఇసుక మాఫియా ఈయన గుప్పిట్లో ఉంది. ప్రశ్నిస్తే డబ్బులు చల్లుతారు..వినకుంటే దాడులు చేస్తారు. కరీంనగర్ లో రంగుల రౌడీ రాజ్యం నడుస్తుంది. న్యాయం ,ధర్మం అంటూ ఇక్కడ బ్రతికి లేదు.
రంగుల కమలాకర్ మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణలో TRS పార్టీ కి తప్పా స్థానం లేదట. మా కోసం ఒక పిచ్చాసుపత్రి కట్టిస్తడట. ఇక మేము నీళ్ళు,కరెంట్,ప్రాజెక్టులు ఎత్తుకు పోతామట. బుర్ర లేని మంత్రి బుర్రలేని మాటలు. ఎవరయ్యా పిచ్చోల్లు, అధికారం పిచ్చి పట్టింది మీకు. డబ్బు పిచ్చి పట్టింది నీకు..కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు. ఏది పడితే అది దోచుకు తినే పిచ్చి మీది. మాకు ప్రజలకు సేవ చేయాలని పిచ్చి ఉంది. ఎండన పడి పాదయాత్ర చేయాలని పిచ్చి ఉంది. ప్రజల దగ్గర ఉండాలని పిచ్చి ఉంది. మీలాగా డబ్బు పిచ్చి, అధికార పిచ్చి మాకు లేదు. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు పిచ్చి,అధికార పిచ్చి నయం చేసే ఆసుపత్రి లో చూపించుకొండి. మీ కళ్ళకు నీళ్ళు ఎత్తుకు పోయేలా కనిపిస్తున్నామా..? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి…ఫామ్ హౌజ్ కి ఎత్తుకు పోయిన దొంగ కేసీఆర్. ప్రాణహిత – చేవెళ్ల తో YSR లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని అనుకున్నారు. రీ డిజైన్ చేసి లక్ష కోట్లు దోచుకు పోయింది మీరు. SRSP ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా YSR కృషి చేశారు. వైఎస్సార్ సాగునీరు ఇస్తే కదా…ఈ కరీంనగర్ సస్యశ్యామలం అయ్యింది. ఇక్కడ భూములకు విలువ పెరిగింది అంటే వైఎస్సార్ కృషి కదా. వైఎస్సార్ ఇచ్చే వాడు…తీసుకొనే వాడు కాదు. మీ కేసీఅర్ తీసుకొనే వాడు..ఎత్తుకు పోయే వాడు. ఇక్కడ నీళ్లను ఫామ్ హౌజ్ కి ఎత్తుకు పోయిన దొంగ కేసీఅర్. తీసుకొనే వాళ్ళు మీరు..కబ్జాలు చేసే వాళ్ళు మీరు… దోచుకు తినే దొంగలు మీరు. ఈయన బిసి సంక్షేమ శాఖ మంత్రి కదా…శాఖ కి ఏమైనా న్యాయం చేయలేదు. బిసి కార్పొరేషన్ అనేది బ్రతికి ఉందా. బిసిలకు అత్మ గౌరవ భవనాలు అన్నారు..ఇచ్చారా. కనీసం బిసి హాస్టళ్లలో మంచి బొజనం పెడుతున్నారా..ఇక్కడ శాతవాహన విశ్వ విద్యాలయాన్ని పట్టించుకున్నరా..? యూనివర్సిటీ ను బ్రష్టు పట్టిస్తున్నారు. ప్రొఫెసర్లు లేరు..కనీసం అన్నం కూడా పెడతలేరు. రోడ్ల పై ఖాళీ ప్లేట్స్ పట్టుకొని ఆందోళనలు కూడా చేశారు. అయినా యూనివర్సిటీ నీ పట్టించుకోలేదు. ఈయన సివిల్ సప్లయ్ శాఖ మంత్రి కూడా. రాష్ట్రంలో 20 లక్షల పెండింగ్ కార్డ్ లు ఉన్నాయి..ఎందుకు ఇవ్వడం లేదు. ఇంట్లో 5 గురు ఉంటే..ఇద్దరికీ రేషన్ ఇస్తే సరిపోతుందా..దొడ్డు బియ్యం ఇస్తూ శాఖ ను ఉద్దరించినట్లు చెప్తున్నారు.
ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈయన రాష్ట్ర అద్యక్షుడు కూడా..కూట్లో రాయి తీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడట. ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంటే… ఏనాడైనా మాట్లాడిండా. ఇక్కడ గ్రానైట్ మాఫియా మీద ఎందుకు మాట్లాడలేదు..? ఈడి వచ్చి సోదాలు చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బండి సంజయ్.. మంత్రి గంగుల ఇద్దరు ఒకటే, ఇద్దరికీ వాటాలు ఉన్నాయి. పెద్ద బీజేపీ నాయకుడు లా రాష్ట్రం గురించి మాట్లాడుతాడు. ఇక్కడ ఈయన ముక్కు కింద జరిగే అవినీతి గురించి మాట్లాడడు. స్మార్ట్ సిటీ అని అని చెప్పి నిధులు వస్తె ఏం చేశారు. మొత్తం మింగేశారట కదా. ఈ బండి సంజయ్ మత పిచ్చి గాడు. మతం పేరుతో చిచ్చు పెట్టాలి..చలి కాచుకోవాలి…ఇదే బీజేపీ రాజకీయం. మతం పేరుతో రాజకీయాలు తప్పా మరోటి లేదు. ప్రజల కోసం ఏనాడు మాట్లాడలేదు. మత పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కనీసం చర్యలు లేవు. ఇలాంటి వాల్లే బీజేపీ కి కావాలి అని చెప్తున్నారు. మత పిచ్చి గాల్లే బీజేపీ కి కావాలని చెప్తున్నారు. బీజేపీ ఎన్ని మాటలు చెప్పింది… ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. 8 ఏళ్లుగా 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కాదా..తెలంగాణ కి కనీసం 10 లక్షల ఉద్యోగాలు అయినా ఇవ్వాలి కదా? విభజన హామీలు ఏవీ..? ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ పాయె, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? దిక్కుమాలిన పార్టీ కి దిక్కుమాలిన అధ్యక్షుడు బండి సంజయ్ .
Also Read : వైఎస్సార్ పథకాల్ని తీసుకొస్తాం – వైఎస్ షర్మిల