Sunday, November 24, 2024
Homeసినిమా'మసూద' బాగానే భయపెట్టేసింది!

‘మసూద’ బాగానే భయపెట్టేసింది!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి .. పెద్ద సినిమా స్థాయిలో ఆసక్తిని రేకెత్తించినవాటి జాబితాలో ‘మసూద‘ ఒకటిగా కనిపిస్తుంది. తెలుగు టైటిల్ ను అరబిక్ స్టైల్లో డిజైన్ చేయించిన తీరే ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రథమ కారణంగా అనిపిస్తుంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయడానికి దెయ్యం నేపథ్యంతో కూడిన కథలు అల్లుకోవడం ఆశ్రయించడం జరుగుతుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో చాలానే సినిమాలు వస్తున్నప్పటికీ వాటిలో భయపెట్టేవి చాలా తక్కువగానే ఉంటాయి. ఇక కొన్ని హారర్ సినిమాల నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తాయి.

చిన్న సినిమాగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మసూద’లో పై లక్షణాలేవీ కనిపించవు. భారీ బడ్జెట్ లేకపోయినా ఫరవాలేదు .. బలమైన కంటెంట్ ఉంటే చాలు భయపెట్టొచ్చని నిరూపించిన సినిమా ఇది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ కథను ఎత్తుకోవడంతోనే దర్శకుడు భయపెట్టడం మొదలుపెట్టేస్తాడు. మొదటి నుంచి చివరి వరకూ కథనం ఆసక్తికరంగా తన స్థాయిని పెంచుకుంటూనే వెళుతుంది. ఎక్కడా కూడా కథాకథనాల గ్రాఫ్ పడిపోయినట్టు కనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగుతో సెకండాఫ్ పై ఉత్కంఠను పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఇంటర్వెల్ తరువాత కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినప్పుడే ప్రేక్షకుడు మరింత థ్రిల్ ఫీలవుతాడు. ‘మసూద’ ఆ అంచనాలు అందుకుంది. కథ మరింత చిక్కబడుతూ క్లైమాక్స్ వైపు తీసుకుని వెళుతుంది. ప్రేతాత్మను బంధించడానికి తెరపై జరిగే తతంగం దృష్టిని మరల్చనివ్వదు. నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరాల పనితనం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళతాయి. ఈ రెండోవ్ కూడా ప్రేక్షకుడు ప్రత్యక్షంగా ఆ సన్నివేశంలో భాగమైన అనుభూతిని కలిగిస్తాయి. క్లైమాక్స్ విషయంలోను ప్రేక్షకులు అసంతృప్తి చెందరు.

ప్రేతాత్మ ఆవహించిన యువతిగా గుంటూరు అమ్మాయి బాంధవి శ్రీధర్ నటన ఈ సినిమాకి హైలైట్. విశాలమైన కళ్లతో అద్భుతమైన హావభావాలను పలికించింది. తనకి ఇదే ఫస్టు మూవీ కావడం .. అయినా ఎక్కడా కొత్త అనేది అనిపించకుండా ఈ స్థాయి నాతననను కనబరచడం విశేషం. మిగతా ముఖ్యమైన పాత్రలలో శుభలేఖ సుధాకర్ .. సంగీత .. తిరువీర్ న్యాయం చేశారు. భారీ బడ్జెట్ అవసరం లేకుండా .. భారీ తారాగణం లేకుండా .. ఎక్కడా కూడా గ్రాఫిక్స్ జోలికి పోకుండా కేవలం కంటెంట్ తోనే భయపెట్టడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడనడంలో సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్