Sunday, November 24, 2024
HomeTrending Newsధరణితో సమస్యలు పెరిగాయి - జీవన్ రెడ్డి

ధరణితో సమస్యలు పెరిగాయి – జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలోని భు సమస్యలు పరిష్కరించే లక్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణి తోనే మరిన్ని సమస్యలు పెరిగాయి..
ఎం ఆర్ ఓ, ఆర్డీవో హక్కులను తొలగించారు . తప్పులను సవరించే అధికారం రెవెన్యూ వ్యవస్థ నుండి తొలగించారు..ధరణి తో ఉన్నతాధికారులకు ధరకాస్తు చేసుకునే ఆప్షన్ తొలగించడమే అన్ని సమ స్యలకు మూలమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ద్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఇందిరాభవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధరణి ఏర్పాటు తర్వాత మరిని సమస్యలు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే కనీసం ఎందుకు తిరస్కరిస్తూ న్నారో కూడా తెలుపడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఏది పరిశీలిస్తున్నారు..ఎది తొలగిస్తున్నారు కూడా తెలియకుండా తెర చాటు చేర్పులు మార్పులు ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైకల్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురు అయి తుందని కలెక్టరుకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది అన్నారు. టీ ఆర్ ఎస్ పాలనలో పారదర్శకత కనుమరుగైంది ఆరోపించారు. అక్షంశాలు, రేఖంశాలు ఆధారంగా ప్రతి రైతు గుంటా భూమి సర్వే చేసి ఎవరి భూమి ఎక్కడ ఉందో పారదర్శకంగా చేస్తామన్న సర్వే ఎక్కడ పోయింది అని నిలదీశారు. అన్ని రాష్ట్రాల్లో సర్వే జరుగుతున్న మన రాష్ట్రంలో మాత్రం సర్వే జరగడం లేదన్నారు. ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకునే అవకాశం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

గతంలో ఏం ఆర్ ఓ కు,ఆర్డీవో, కలెక్టర్ కు ధరఖాస్తు చేసుకునేవారు.. అందరి అధికారాలు తొలగించడం తో రెవెన్యూ వ్యవస్థను సీఎం కెసిఆర్ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఆన్లైన్ తో పాటు..ఆఫ్లైన్ లో కూడా ధర కాస్తులు స్వీకరించాలి. భు సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో సైతం దరఖాస్తులు స్వీకరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధి గా అధికారులకు విజ్ఞప్తి చేస్తే కనీసం ఏం చర్యలు చేపట్టారు చెప్పడం లేదని, ఇది కేవలం తనకేనా అధికార పార్టీ ఎమ్మెల్యేల కుసైతం ఇంతేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.

రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నా ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గ్రామాల్లో రైతుల భు సమస్యలు పరిష్కారించెందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. వారి నుండి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. వెంటనే సదస్సుల తేదీలు ప్రకటించాలి. జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. భేషజాలకు పోకుండా రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాకో రెవెన్యూ ధరణి ఇటీవల పరిష్కరించిన వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. గ్రామ పంచాయతీల్లో సర్వే నంబర్ల వారీగా జాబితా ప్రదర్శించాలి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగులను గుండా దెబ్బ తీసిన సీఎం కెసిఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తె ఉద్యోగాలు పెరుగుతాయి అనుకుంటే సీఎం కెసిఆర్ ఉన్న వాటినే రద్దు చేసి నిరుద్యోగులను దొంగ దెబ్బ తీశాడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడీ విమర్శించారు. వి.ఆర్.ఓ వ్యవస్థను రద్దు చేసి గ్రామ స్థాయిలో ప్రభుత్వం లేకుండా చేశారు. ప్రకృతి విపత్తుల తో పంట నష్టం జరిగితే కనీసం నివేదిక ఇచ్చే వారు లేరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల వి.ఆర్.ఓ ఉద్యోగాలను రద్దు చేసి, ఇతర విభాగాలు సర్దుబాటు చేయడం తో నిరుద్యోగులు మరో 10 వేల ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందని ఉద్యోగాలను రద్దు చేయడం దారుణమని అన్నారు.

కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహ మోహన్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, రాధా కిషన్, కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిరజొద్దిన్ మన్సూర్, తటిపర్థి దేవేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధర రమేష్ బాబు, యువజన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు గుండా మధు, మామిడిపల్లి మహిపాల్, భాస్కర్ పాల్గొన్నారు.

Also Read : ధరణి రద్దు చేస్తాం – రాహుల్ గాంధి

RELATED ARTICLES

Most Popular

న్యూస్