దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445.. ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మొత్తం ఖాళీల్లో తెలంగాణ సర్కిల్ పరిధిలో 2513 పోస్టులున్నాయి. ఇందులో 1553 పోస్ట్‌మెన్ జాబ్స్.. 82 మెయిల్ గార్డ్ పోస్టులు.. 878 ఎంటీఎస్ పోస్టులున్నాయి.
అర్హతలు: పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివరాలకు www.indiapost.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలి.