తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకూ జి 20 కూటమి అధ్యక్షుడిగా భారత్ వ్యవహరించనుంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన జి 20 సదస్సులో భారత ప్రధాని మోడీకి ఆ గ్రూప్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే.
వచ్చే ఏడాది జి 20 సమావేశాలు ఇండియాలో జరగనున్నాయి. ఈ సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ న్రివహిస్తోంది. డిసెంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా జరిగిన జాతీయ స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరై, ప్రధాని మోడీతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మళ్ళీ ఈ భేటీకి బాబు హాజరు కానున్నారు.
Also Read : ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్