Saturday, November 23, 2024
HomeTrending NewsDon’t Care: భయపడేవాళ్ళు లేరు: కవిత

Don’t Care: భయపడేవాళ్ళు లేరు: కవిత

బిజెపి నేతలు రాముడి పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రామ్ రామ్ జ‌ప్నా..ప‌రాయి లీడ‌ర్ అప్నా అన్నట్లు బిజెపి తీరు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.  ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కవిత ప్రసంగించారు.  ఈడీ, ఐటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని, టిఆర్ఎస్ నేతలు రాజకీయంగా ఆగం కావొద్దని ఆమె సూచించారు. తెలంగాణాలో  భయపడేవాళ్ళు ఎవరూ లేరని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ చేశారు.

తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విచారణకు భయపడడం లేదని, సహకరిస్తున్నారని… కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని, ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. ఇక్కడ దొరికిన దొంగల  మీద విచార‌ణ చేయవద్దంటూ కోర్డు నుండి స్టే తెచ్చారని, కానీ తాము సుప్రీం కోర్టు వరకూ వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నామని కవిత అన్నారు.  సంజయ్ యాద‌గిరి గుట్టకు వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారని,  నిన్న ఏడ్చారని…. ఆయన ఎందుకు ఏడ్చాడో తెలియ‌దని ఎద్దేవా చేశారు.  అడ్డంగా దోరికిన  బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని కోర్టుకు వెళ్ళారని,  కనీసం విచార‌ణ‌కు హాజరు కావాలని కోర్టు చెప్పినా… విచార‌ణ కూడా రాన‌ని మ‌ళ్లి కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు.

బ‌య‌టి లీడ‌ర్లను తీసుకువ‌చ్చి రాజ‌కీయం చేయ‌డం బిజేపి ప‌ని అయ్యిందని, ఈడి, ఐటిల‌తో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, బిజెపిలో చేరకపోతే  ఐటి, ఈడి కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.  నెల రోజుల నుండి మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను వ‌ద‌ల‌కుండా రైడ్ చేస్తున్నారన్నారు. వ్యాపారం లీగ‌ల్ చేసుకుంటారని, అధికారులు అడిగితే స‌మాధానం చెబుతారని వెల్లడించారు.

Also Read : విచ్ఛిన్నకారుల పట్ల కలానికి పదునుపెట్టాలి – కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్