న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది రైతులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రభుత్వం నోటీసు ఇచ్చినా, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారని ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై వెంటనే హైకోర్టు స్టే విధించింది.
ఇప్పటం గ్రామస్తులకు మే నెలలోనే నోటీసులు ఇచ్చామంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. రైతులు అవగాహన లేకనే ఈ విధంగా చెప్పారని, కోర్టు మన్నించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు.