Sunday, November 24, 2024
HomeTrending Newsడిసెంబర్ లో శాసనసభ సమావేశాలు

డిసెంబర్ లో శాసనసభ సమావేశాలు

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Also Read :  తెలంగాణ ప్రగతి చిహ్నం…అంబేద్కర్ సచివాలయం – కెసిఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్