సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం‘. నాగశేఖర్ ని తెలుగుకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించగా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ లో హీరోయిన్ గా నటించిన కావ్య శెట్టి మీడియాతో చిత్ర విశేషాలను తెలియచేశారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే… మాది కన్నడ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్ గా కన్నడలో నేను నటించిన లవ్ మాక్టేల్ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చింది. అలాగే మలయాళం లో 1, తమిళ్ లో 3 సినిమాలు చేశాను. అయితే తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం. మనకు స్కూల్ నుండి వింటర్ సీజన్ వరకు ఉన్నట్లే చాలా నేచురల్ గా మూడు లవ్ స్టోరిస్ (త్రీ ఏజ్ గ్రూప్స్) కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కూడా ఇందులో ఉండే లవ్ స్టోరీస్ ఏదో నార్మల్ గా వుండవు. మీ హర్ట్ ని టచ్ చేసేలా వుంటాయి.
ఇందులో నేను కాలేజీ గర్ల్ గా అమ్ములు పాత్రలో నవ్విస్తాను. కాలేజ్ నేపథ్యంలో సాగే నా పాత్ర మాత్రం ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ మెంట్ నిస్తుంది .ఆ తరువాత తమన్నాతో ఎమోషనల్, ఆ తరువాత ఏజ్ గ్రూప్ మోర్ ఫన్ ఇందులో ఉంటుంది. నేను డి గ్లామర్ పాత్రలో ఒక సినిమా చేశాను కానీ నాకు గ్లామర్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే “గుర్తుందా శీతాకాలం”’ మాత్రం నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం చాలా ఎక్సటింగ్ గా ఉన్నాను. అలాగే ఇప్పుడు తెలుగులో విడుదల అవుతున్న ఈ సినిమా నాకు పర్ఫెక్ట్ లాంచ్ అనుకుంటున్నాను.
నా కో స్టార్ సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాలో నాకున్న డైలాగ్స్ కు ఎక్కువగా తనే హెల్ప్ చేశాడు. తనతో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. అయితే తమన్నాతో నాకు ఎటువంటి సీన్స్ లేవు, కానీ ప్రియదర్శి తో సీన్స్ వున్నాయి. కాలభైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది.ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి. కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయిన నిర్మాతలు రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచారు.ఈ సినిమా ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు లలో మంచి మంచి లొకేషన్స్ లలో షూట్ చేశారు. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టి వంటి వారందరినీ అదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. వారిని ఆదరించినట్లే నన్ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూడు కన్నడ సినిమాలు , ఆమెజాన్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది.ఇంకా కొన్ని లైనప్ లో ఉన్నాయి.ఈ డిసెంబర్ 9 న శీతాకాలంలో వస్తున్న మా “గుర్తుందా శీతాకాలం” సినిమాను ధియేటర్స్ కి వచ్చి చూడండి మీ గుండెల్లో నిలిచిపోతుంది.