Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్IND Vs. NZ: మూడో వన్డేకూ వర్షం అడ్డు; కివీస్ కే సిరీస్

IND Vs. NZ: మూడో వన్డేకూ వర్షం అడ్డు; కివీస్ కే సిరీస్

ఇండియా-న్యూజిలాండ్ మధ్య నేడు మొదలైన చివరి, మూడో వన్డే కూడా వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. క్రైస్ట్ చర్చ్ లోని హేగలీ ఓవల్ మైదానంలోని నేటి మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఇండియా జట్టులో వాషింగ్టన్ సుందర్ -51; శ్రేయాస్ అయ్యర్-49; ధావన్-28 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమవ్వడంతో 47.3 ఓవర్లలో 219  పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కివీస్ బౌలర్లలో మిల్నే, డెరిల్ మిచెల్ చెరో మూడు; సౌతీ రెండు; ఫెర్గ్యూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కివీస్ తొలి వికెట్ కు 97 పరుగులు చేసింది. ఫిన్ అల్లెన్ 57 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో సూర్య ఉమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. స్కోరు 104 వద్ద వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే-38; కెప్టెన్ విలియమ్సన్ -0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి వన్డేలో కివీస్ ఏడు వికెట్లతో విజయం సాధించగా మిలిగిన రెండు మ్యాచ్ లూ ఫలితం తేలకుండానే వర్షం కారణంగా రద్దయ్యాయి.

దీనితో కివీస్ 1-0తో సిరీస్ ను గెల్చుకుంది.

టామ్ లాథమ్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ దక్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్