Sunday, November 24, 2024
HomeTrending Newsఅర్బన్ ఎకో పార్క్ లో... బర్డ్స్ ఎన్ క్లోజర్

అర్బన్ ఎకో పార్క్ లో… బర్డ్స్ ఎన్ క్లోజర్

దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పక్షుల కిలకిల రావాలు వినేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలి వచ్చేలా బర్డ్స్ ఎన్ క్లోజర్ ను తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన సీఎం కేసీఆర్… బర్డ్స్ ఎన్ క్లోజర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో మంత్రి కెసిఆర్ అర్బన్ ఎకో పార్కును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

800 రకాల పక్షులను ఒకేచోట ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. బర్డ్స్ ఎన్ క్లోజర్ లోపలికి వెళ్లి దగ్గరి నుంచి పక్షులను తిలకించేందుకు అవకాశం ఉంటుందని, అక్కడే ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ మందు నిలబడి సెల్ఫీలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ ను తెలంగాణకు ఒక ఐకాన్ లా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఆర్ అండ్ బి (జాతీయ రహదారులు) ఈ ఎన్ సి గణపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీసీఎఫ్ క్షితిజ, వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజ, డీఎఫ్ఓ సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్