Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Steven Smith  Double ton: ఆస్ట్రేలియా భారీ స్కోరు

Steven Smith  Double ton: ఆస్ట్రేలియా భారీ స్కోరు

లబుషేన్ తో పాటు స్టీవెన్ స్మిత్ డబుల్ సెంచరీ లతో రాణించడంతో వెస్టిండీస్ తో జరుతుతోన్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 598 పరుగుల భారీ స్కోరు చేసింది.

విండీస్ తో రెండు టెస్టుల సిరీస్ట్ కు ఆసీస్ ఆతిథ్యం ఇస్తోంది. పెర్త్ స్టేడియంలో నిన్న మొదలైన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.  రెండు వికెట్ల నష్టానికి 293 పరుగులతో రెండో రోజు ఆట ఆసీస్ మొదలు పెట్టింది. నిన్న 154 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజులో ఉన్న లాబుషేన్ నేడు తన కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. 20 ఫోర్లు, 1 సిక్సర్ తో 204 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న 59 పరుగులతో క్రీజులో ఉన్న స్మిత్ తన కెరీర్ లో నాలుగో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచాడు. స్మిత్ ఈ ఫీట్ సాధించిన తర్వాతి బంతికే…. లబుషేన్ ఔటైన  తరువాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ 99 పరుగుల వద్ద విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. హెడ్ వికెట్ పడిన వెంటనే కెప్టెన్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆసీస్ 4వికెట్లకు  598 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రాత్ వైట్ రెండు; కేల్ మేయర్స్, జేదేన్ సీల్స్ చెరో వికెట్ పడగొట్టారు.

స్టీవెన్ స్మిత్- లబుషేన్ లు మూడో వికెట్ కు 251పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.

స్మిత్- హెడ్ లు నాలుగో వికెట్ కు 196 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు

ఆ తర్వాత బ్యాటింగ్  మొదలు పెట్టిన విండీస్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కెప్టెన్ వైట్ 18; ఈ టెస్ట్ మ్యాచ్ తోనే ఆరంగ్రేటం చేసిన త్యాగి చందర్ పాల్ 47 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్