Saturday, November 23, 2024
HomeTrending Newsజి-20 సన్నాహక సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌

జి-20 సన్నాహక సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోకాహాలులో సోమవారం సమావేశం నిర్వహించారు. సీఎం  వైయస్‌.జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం మాట్లాడారు.


జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాజకీయపార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం చేసుకుని సదస్సు విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి విజయవాడ బయల్దేరారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్