Sunday, November 24, 2024
HomeTrending News“గుర్తుందా శీతాకాలం” సినిమాను గీతాంజలితో పోల్చడం చాలా హ్యాపీ గా ఉంది - తమన్నా

“గుర్తుందా శీతాకాలం” సినిమాను గీతాంజలితో పోల్చడం చాలా హ్యాపీ గా ఉంది – తమన్నా

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా గుర్తుందా శీతాకాలం మన ముందుకు వస్తుంది. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈ చిత్రం రూపొందింది. ఇందులో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

ఈ సందర్బంగా మిల్క్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ.. రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా ఛాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి. సినిమాను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాం.

సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరుతూ ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దొరికింది. హీరోల్లో పెద్ద హీరో, చిన్న చిన్న చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే.. సినిమా కథ బాగుండాలి ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను.

ఇందులో నేను స్టార్ హీరోయిన్ మిగతా వాళ్లు కొత్త వాళ్ళని ఎప్పుడూ అనుకోను. నా క్యారెక్టర్ వరకు నేను న్యాయం చేయాలని చూస్తాను. అయితే డైరెక్టర్ నాగ శేఖర్ గారు కూడా యాక్టర్ కావడంతో మాకు ఈజీ అయింది. ఇప్పటి వరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు తను యాక్టర్ కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను.

ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను. గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలి సినిమాలో పోలుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది.ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మేము రీచ్ అవుతాము అనే నమ్మకంతో ఉన్నాము. ఈ సంవత్సరం F 3 తరువాత ఇప్పుడు “గుర్తుందా శీతా కాలం” రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో “భోళాశంకర్ ” ప్రాజెక్ట్ చేస్తున్నాను,అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్