ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కో-కన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరనసనగా పిసిసి పిలుపుమేరకు జగిత్యాలలో ఎడ్ల బండ్లు, సైకిల్, రిక్షా లతో ఇందిరా భవన్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడ్డ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి 45 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బిజెపి ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయలు ఆదాని, అంబానీలకోసం సంపాదించి పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని గడప, గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యంచేసి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. జగిత్యాల
డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ శంకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. దేశ సమగ్రత కాంగ్రెస్ తోనే సాధ్యమని,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
నిరసన కార్యక్రమంలో నాయకులు జువ్వాడి కృష్ణారావు,తాటిపర్తి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య,మన్సూర్,కోర్టు శ్రీనివాస్, సొగ్రాభి, రామచంద్రా రెడ్డి, ముస్కు నిశాంత్ రెడ్డి, పులి రామ్, మహిపాల్ రెడ్డి, గంగాధర్, రవీందర్ రావు, లక్ష్మణ్, శంకర్ తదితరులున్నారు.