Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్India (W)-Australia (W): మూడో టి 20 లో ఆసీస్ విజయం

India (W)-Australia (W): మూడో టి 20 లో ఆసీస్ విజయం

ఇండియా – ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడో టి 20 లో ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో షఫాలీ వర్మ – కెప్టెన్ హర్మన్ ప్రీత్ లు మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే షఫాలీ వర్మ(52) ఔటైన తర్వాత జట్టు వరుస వికెట్లు సమర్పించుకుంది.  చివర్లో దీప్తి శర్మ 25 పరుగులు చేసినా లాభం లేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 37 పరుగులతో రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151  పరుగులు చేయగలిగింది.

ఆసీస్ బౌలర్లలోడార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డ్ నర్ చెరో రెండు; ష్కట్, కారీ చెరో వికెట్ పడగొట్టారు.

ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ మహిళలు ఐదు పరుగులకే రెండు వికెట్లు (అలెస్సా హేలీ-1; తహీలా మెక్ గ్రాత్-­1) కోల్పోయింది. బెత్ మూనీ 30 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 47  బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో  75;  గ్రేస్ హారిస్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172  పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్, అంజలి శర్వాణి, దీప్తి శర్మ, దేవిక వైద్య తలా రెండు వికెట్లు సాధించారు.

చివరి నాలుగు ఓవర్లలో ప్రతి ఓవర్ తొలి బంతికి ఒక వికెట్ కోల్పోవడం విశేషం.

తొలి రెండు వికెట్లు తీసిన డార్సీ బ్రౌన్ కు  ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : India 278/6: రాణించిన శ్రేయాస్, పుజారా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్