Sunday, November 24, 2024
HomeTrending Newsఅటవీ అధికారి కేసులో సుప్రీం నోటీసులు

అటవీ అధికారి కేసులో సుప్రీం నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమనాధ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఈ కేసు వాదనలు జరిగాయి.

ఈ ఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన “అడవులు వ్యవహారలపై సుప్రీంకోర్టు లో “అమైకస్ క్యూరీ” ( న్యాయ సలహాదారు) గా ఉన్న న్యాయవాది ఏడిఎన్ రావు. పిటీషన్ దాఖలు చేయడంతో పాటు, ధర్మాసనం ముందు వాదనలు కూడా వినిపించిన న్యాయవాది ఏడిఎన్ రావు. ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అడవుల వ్వవహారాలపై
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన “సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ” ని ఆదేశించిన ధర్మాసనం. ఈ ఏడాది నవంబర్ 23 తేదీన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలో ఎర్రబోడు అడవుల్లో అటవీ అధికారి పై “గుత్తి కోయ
ఆదివాసుల” బృందం దాడి. “పోడు భూములు” విషయంలో “గుత్తి కోయ ఆదివాసీలు” బృందం కొడవళ్లు, కత్తులతో “ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్” ( ఎఫ్.ఆర్.ఓ) చళ్ళమళ్ళ శ్రీనివాసరావు పై దాడి.

ఈ దాడిలో అటవీ అధికారి మృతి చెందినట్లు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు అమైకస్ క్యూరీ సుమోటాగా పిటీషన్ దాఖలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్