భారతదేశంతో సరిహద్దులను కలిగి ఉన్న దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా దక్షిణాసియాపై పట్టు బిగించేందుకు చైనా పావులు కదుపుతోంది. అప్పులు, ఆయుధాలు.. ఇవే అస్త్రాలుగా ఆయా దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేందుకు వ్యూహాలు పన్నుతోంది. డ్రాగన్ ‘రుణ వల’కు చిక్కుకుంటున్న దేశాలు అందులో నుంచి బయటపడే మార్గం లేక చైనా అడుగులకు మడుగులొత్తాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నాయి. తొలుత పాకిస్తాన్‌పై తన వ్యూహాన్ని అమలు చేసిన చైనా అక్కడ గొప్ప విజయమే సాధించింది. పాకిస్తాన్ ను తనకు వలస దేశంగా మార్చేసుకుంది. అదే కోవలో శ్రీలంకను అప్పుల కుప్పగా మార్చేసి..హంబాన్ తోట ఓడరేవును కబ్జా చేసుకుంది. ఆ ఉత్సాహంతో మిగిలిన పొరుగుదేశాలపైనా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
మయన్మార్‌లో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశాన్ని చైనా పూర్తిగా తన గుప్పిట బంధించింది. మయన్మార్‌లో 1990 నుంచి మౌలిక రంగంలో చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. మయన్మార్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనానే. బంగ్లాదేశ్ విముక్తిలో భారత్ కీలక పాత్ర పోషించినా ఆ దేశం భారత్ కన్నా చైనాతోనే ఎక్కువ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అటు బంగ్లాదేశ్‌కు కూడా చైనా ప్రధాన ఆయుధ సరఫరాదారు. 2016లో ఆ దేశానికి చైనా ఆ దేశానికి రెండు జలాంతర్గాములను అందించింది.
జుంట పాలకులకు కొమ్ము కాస్తున్న చైనా…అక్కడి సహజ వనరులను చౌకగా తరలించుకు పోతోంది. రాకినే రాష్ట్రంలో ప్రత్యెక ఆర్థిక మండలి ఏర్పాటు చేసిన చైనా అక్కడి నుంచి కలప, గ్యాస్, కాపర్ తదితర వనరుల్ని తీసుకేలుతోంది. క్యాఫియు ఓడ రేవు ద్వారా తీసుకెల్లటాన్ని బర్మా ప్రజలు వ్యతిరేకిస్తున్నా జుంట పాలకులు పట్టించుకోవటం లేదు.
Also Read : తవాంగ్‌పై పట్టు కోసం చైనా బరితెగింపు