Saturday, January 18, 2025
Homeసినిమాబిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరు?

బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరు?

బిగ్ బాస్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది కింగ్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత సీజన్ 2 కు నాని హోస్ట్ గా చేశారు. ఆతర్వాత బిగ్ బాస్ 3 నుంచి బిగ్ బాస్ 6 వరకు నాగార్జునే హోస్ట్ గా ఉన్నారు. తనదైన స్టైల్ లో షో ను రన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.  ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తుంది. ఈ సీజన్ ఎండింగ్ కి వచ్చింది. దీంతో సీజన్ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? దీనికి హోస్ట్ నాగార్జునే ఉంటారా..? లేక వేరే వాళ్లు హోస్ట్ గా చేయనున్నారా..? అనేది ఆసక్తిగా మారింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా ఉండేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఈ షో వల్ల సినిమాలకు అన్యాయం చేస్తున్నాననే ఫీలింగ్ లో ఉన్నారట. దాదాపుగా నాలుగు నెలల పాటు బిగ్ బాస్ వల్ల సినిమా షూటింగ్స్ కు ఇబ్బంది అవుతుందని, అందుకే బిగ్ బాస్ ను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ స్టార్ హీరోలు మొదలుకుని పలువురు యంగ్ స్టార్ హీరోల పేర్లు పరిశీలనకు ఉన్నారని సమాచారం.

చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌ బాబు, విజయ్ దేవరకొండ.. ఇలా ఎంతో మంది పేర్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అందులో ఎవరు ఆసక్తిగా ఉన్నారు. నిర్వాహకులు ఎవరికి ఓటు వేస్తారు అనేది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ కు తెలుగు లో ఒక వర్గం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి హోస్ట్ తో మంచి కంటెస్టెంట్స్ తో షో రన్ చేస్తే ఖచ్చితంగా భారీగా రేటింగ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మరి.. బిగ్ బాస్ 7 హోస్ట్ గురించి క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్