Sunday, September 22, 2024
HomeTrending Newsబిఆర్ఎస్ పేరు మార్పుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

బిఆర్ఎస్ పేరు మార్పుపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు

ఢిల్లీ హైకోర్టు లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన కేసులో ఈ రోజు వాదనలు జరిగాయి. రేవంత్ రెడ్డి వేసిన కేసుపైన మీకు ఏ శాఖల పైన అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని స్వేచ్చ ఇచ్చిన కోర్టు. ఈ కేసును ముగిస్తూ.. మరో పిటిషన్ వేసుకోవడానికి అవకాశాలు ఇచ్చిన కోర్ట్. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారుస్తూ తీస్కున్న నిర్ణయానికి ఎన్నికల సంఘం అనుమతి లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.

గతంలో టిఆర్ఎస్ బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఐ.టి శాఖ కు సంబంధించిన విచారణ పెండింగ్ లో ఉంది. ఈ పరిశీలన పూర్తి కాకుండా బిఆర్ఎస్ గా పేరు మార్చవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 6వ తేదీ లోపు బిఆర్ఎస్ విషయంలో అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన మేరకు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు నమోదు చేశారు. అయిన కూడా రేవంత్ రెడ్డి అభ్యంతరం పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం బిఆర్ఎస్ కు లేఖ ఇచ్చింది. ఈ విషయం పైన ఢిల్లీ హైకోర్టు లో రేవంత్ రెడ్డి కేసు నేమోదు చేశారు. ఆ కేసులో వాదనలు ఈ రోజు జరిగాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్