Tuesday, October 1, 2024
Homeసినిమామోహన్ బాబు గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి : విశాల్

మోహన్ బాబు గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి : విశాల్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లాఠీ. ఈ భారీ యాక్షన్ మూవీని రానా ప్రొడక్షన్స్‌ పై రమణ, నంద సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విశాల్ కు జంటగా సునైనా నటించింది. నిజాయితీ గల కానిస్టేబుల్ గా విశాల్ నటించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్సాన్స్ రావడంతో లాఠీ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లాఠీ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గారికి నేను మూడో కొడుకుని. నన్ను వాళ్ళ ఇంటి బిడ్డలా ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ వేడుకకు మోహన్ బాబు గారిని పిలవడానికి ఒక కారణం వుంది. మోహన్ బాబు గారు ఒక నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్త గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనకంటూ ఒక స్టయిల్ పెట్టుకొని ఎన్నో సినిమాలు చేసి మనల్ని అలరించారు. 18 ఏళ్లుగా మీ ఆదరణ వలన ఇక్కడ హీరోగా నిలబడ్డాను. నన్ను ఎంతగానో ఆదరించి విజల్స్ చప్పట్లు కొడుతున్నారు. దీనంతటికీ కారణం.. మోహన్ బాబు గారు. నేను టెన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు ‘యం. ధర్మరాజు ఎం.ఎ’ షూటింగ్ కి నాన్న గారు తీసుకెళ్ళారు. ఒక మూల నిలబడి మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ గమనిస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు గారు నన్ను నాన్న గారిని పిలిచి” ఈ అబ్బాయి మొహంలో కళ వుంది. తప్పకుండా హీరో అవుతాడు” అన్నారు. అలా చెప్పిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. అప్పటికి నేను ఒక నటుడిని అవుతానే ఆలోచన కూడా లేదు. కానీ మోహన్ బాబు గారు అప్పుడే బలంగా చెప్పారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి.

దేవుడు, ప్రేక్షకుల దయ వల్ల హీరోగా మీ ముందు నిలబడ్డాను. ‘లాఠీ‘ డిసెంబర్ 22న వస్తోంది. మీ అందరూ చూడండి. తప్పకుండా నచ్చుతుంది. లాఠీ సినిమా ప్రతి కానిస్టేబుల్ కి ఒక ట్రిబ్యూట్. కానిస్టేబుల్ కి ఒక లైఫ్ స్టయిల్ లేదు. సమాజం మేలు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. నేను రీల్ లైఫ్ హీరో. వాళ్ళు రియల్ లైఫ్ హీరోలు. వాళ్ళే స్ఫూర్తి. ఖాకీ యూనిఫామ్ వేసుకొని నటించేటప్పుడు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. కానిస్టేబుల్ కి గన్ వుండదు. ఒకే ఒక లాఠీ పట్టుకొని రంగంలో దిగుతారు. నేరస్తులని పట్టుకుంటారు. ఈ కథ విన్నప్పుడు తప్పకుండా చేయాలనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. ఇందులో యాక్షన్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఎక్స్ టార్డినరీ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు. మీరంతా థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. మోహన్ బాబు గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. ఆయన పక్కన నిలబడటం ఒక గౌరవంగా భావిస్తున్నాను” అన్నారు.

Also Read : విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్