Tabs- Digital Education: ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయాల విషయంలో దేశాల మధ్య ఉన్నట్టే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎన్నో అంతరాలు ఉన్నాయని…. మన రాష్ట్రంలో కూడా వివిధ వర్గాల మధ్య ఇలాంటి అంతరాలే ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక దేశాల్లో తలసరి ఆదాయం 40 వేల నుంచి లక్ష డాలర్ల వరకూ ఉంటుందని వారు ఏటా 30 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకూ సంపాదించుకుంటున్నారని, కానీ మనదేశంలో 2 నుంచి 3 వేల డాలర్లు మాత్రమే ఉందని, అంటే కనీసం ఏటా 2 లక్షల రూపాయలు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నామని వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులకుట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా యడ్లపల్లి జిలా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తన పుట్టిన రోజు నాడు తనకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తుకోసం చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
సామాజిక అంతరాలను కొనసాగించే విద్యా వ్యవస్థను ఇంకా ఎందుకు కొనసాగించాలనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. మన సమాజంలో కొందరు 21వ శతాబ్దంలో ఉంటే మరి కొందరు 19వ శతాబ్దంలోనే ఉన్నారని, వారి తలరాతలను మార్చాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
సిఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు అయన మాటల్లోనే….
- మన రాష్ట్రంలో ప్రతి పాప, ప్రతి బాబు బాగా చదివేందుకు వీలుగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఈప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది
- ప్రతి బడిలోనూ ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం
- పిల్లకు ఇంగ్లిషు మీడియంలో చదవకూడదు, డిజిటల్ పద్ధతుల్లో పిల్లలకు చదువులు చెప్పకూడదని పెత్తందారీ భావాలున్నవారు ఆరాటపడుతున్నారు
- ఇలాంటి పెత్తందారీ మనస్తత్వాలుఉన్నవారిని అధికారంలోకి రాగానే చూసినప్పుడు బాధేసింది
- కాని ఈ మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా కూడా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు
- అలాంటి పెత్తందారీ భావాలను బద్దలుకొడుతూ రాష్ట్రంలో స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి తెరతీశామని గర్వంగా, సగర్వంగా తెలియజేస్తున్నాం
- ఆర్థిక అసమానతలు ఎన్ని ఉన్నా.. అందించే చదువుల్లో సమానత్వం తీసుకురాగలిగితే ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకుంటుంది
- అణగారిన వర్గాల్లోని చిన్నారుల చరిత్రను మార్చలేమా? వీరి బతుకులు ఇలానే కొనసాగాలా? మార్చలేమా? అని ప్రతి అడుగులోనూ నా మనస్సులో కనిపిస్తుంది
- ఈ వర్గాలు నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ మీడియం చదువుల్ని చదువుకోవడానికి వీల్లేదా? అనే ప్రశ్న తలెత్తుతుంటుంది
- పెత్తందారుల పిల్లలు, వారి పిల్లలు మాత్రమే ఇంగ్లిషు మీడియంలోనే చదవాలా?
- ఇంగ్లీష్ మేదియంపై ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది
- సామాజిక అంతరాలను అలాగే కొనసాగించే విద్యా విధానాన్ని, అధికారంలో వాటా ఇవ్వని రాజకీయ విధానాన్ని ఇకమీదట కొనసాగించాల్సిందేనా?
- క్లాస్ డిస్ట్ర్రిమినేషన్ ఇంకా కొనసాగాల్సిందేనా? ఒక్కసారి ఆలోచన చేయాలి
- పలకల చదువులతోనే కొన్ని తరాల విద్యాభ్యాసం ముగిసిపోయింది
- ట్యాబులు, డిజిటల్ మీడియం అందుబాటులో ఉన్న సమాజాన్ని మనం ఆమోదించవద్దా?
- నేను మీ వాడిగా, మీలో ఒకడిగా… మీ బిడ్డగా, మీ మేనమామాగా, ఆ ప్రతి తల్లికీ అన్నగా మీకోసం నేనున్నాను
- ఇంటర్నెట్ ఉండడం, లేకపోవడం కూడా అసమానతలకు దారితీస్తోంది
- ఈ అసమానతలన్నింటినీకూడా మారుస్తూ మార్పులు రావాలి
- నా పుట్టినరోజు గురించి కాదు, ఈ తరం బిడ్డల గురించి మాట్లాడుతున్నా
- వచ్చే తరం పిల్లలమీద కూడా మంచి మేనమామగా బాధ్యత తీసుకున్నాను
- రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను పంపిణీచేస్తున్నాం
- ప్రభుత్వం, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న వారికి ట్యాబులు
- వీళ్లంతా 10వ తరగతి పరీక్షలు రాసేసమయానికి సుశిక్షితులు చేసేందుకు ఈ ట్యాబులు
- వీరికి చదవులు చెప్తున్న టీచర్లకూ ట్యాబులు ఇస్తున్నాం
- 26 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నవారందరికీ ఇస్తున్నాం
- ఈ సంవత్సరం నుంచి ఇక మీదట 8వ తరగతిలోకి వచ్చే ప్రతి విద్యార్థికీ ట్యాబులు ఇస్తాం
- ట్యాబుల్లో ఇంగ్లిషులోనూ, తెలుగులోనూ సబ్జెక్టులు ఉంటాయి
- బాగా అర్థం కావడానికి అన్ని భాషల్లో పాఠాలు ఉంటాయి
- ట్యాబులు కారణంగా ఎంతో మేలు జరుగుతుంది
- అరటిపండు వలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థం అయ్యేందుకు ట్యాబులు ఉపయోగపడతాయి
- ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్ సులభతరంగా అర్థంచేసుకునేందుకు ఉపకరిస్తుంది
- టీచర్లు చెప్పే పాఠాలు మరింత అర్థంచేసుకునేందుకు ఈ శ్యాంసంగ్ ట్యాబ్ ఉపయోగపడుతుంది
- సెక్యూర్డ్ డిజిటల్ కార్డు కూడా ట్యాబుల్లో ఉంటుంది
- దీనివల్ల 8,9 తరగతులకు సంబంధించి పాఠాలు లోడ్‌చేసి ఇస్తున్నారు
- ఇంటర్నెట్ లేకపోయినా ఆప్లైన్లోకూడా ఈ ట్యాబులు ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుంది
- ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ సబ్జెక్టులు నేర్చుకోవచ్చు
- ట్యాబులకు మూడు సంవత్సరాల వ్యారెంటు ఉంటుంది
- మనం ఇచ్చే టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి తప్ప చెడు జరక్కూడదు
- ఇదే ఆలోచనతో ఎండీఎం సాఫ్ట్వేర్ పెట్టారు
- దీనివల్ల ట్యాబుల్లో పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు
- పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్‌ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడు
- పిల్లలు, ఏంచూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకుఈ సాఫ్ట్వేర్ద్వారా తెలుస్తుంది
- ట్యాబులు మిస్యూజ్ అయ్యే అవకాశాల్లేవు
- ట్యాబుతో సహా కంటెంట్‌తో కలిపి దాదాపు రూ.32వేలు ఇచ్చినట్టు అవుతుంది
- బైజూస్ తన కంటెంట్‌ను సీఎస్ఆర్ కింద ఉచితంగా ఇచ్చింది, దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
- ఆరువ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రతి క్లాసులోనూ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం
- ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి పై తరగతి వరకూ ప్రతి సెక్షన్‌లోనూ డిజిటల్ క్లాస్‌రూమ్స్ కాబోతున్నాయి
- నాడు – నేడు కింద మొదటిదశలో పనులు పూర్తిచేసుకున్న తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు పెట్టి డిజిటల్ క్లాస్‌రూమ్స్‌గా మార్బబోతున్నాం వచ్చే జూన్‌కల్లా.. వీటి ఏర్పాటు పూర్తవుతుంది
అంటూ సిఎం తన ప్రసంగంలో వివరించారు.
Also Read : నేడు విద్యార్ధులకు టాబ్ ల పంపిణీ ప్రారంభం