Wednesday, April 23, 2025
HomeTrending Newsత్వరలో మరికొన్నిచోట్ల నీరా కేంద్రాలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

త్వరలో మరికొన్నిచోట్ల నీరా కేంద్రాలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గీత కార్మికులను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల అధికారులు,గౌడ కులస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశం మంత్రి మాట్లాడారు. నాగర్ కర్నూల్‌ను గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

Neera Cafe

కులవృత్తులను బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. హరిత హారంలో అధికంగా ఈతమొక్కలను నాటేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్ , గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్