‘విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖపట్నం సిటీకి ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు’ అనే డైలాగ్‌తో కొరమీను ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ డైలాగ్ వచ్చే సమయంలోనే మీసాల రాజుగా యాక్టర్ శత్రు ఇంట్రడక్షన్ ఇచ్చారు. విశాఖకు వచ్చిన మీసాల రాజుకి మీసాలుండవు. అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. సీతారామరాజుకి అది పెద్ద సమస్యగా మారుతుంది. మరో వైపు విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్‌కి సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్ చేస్తాడు.
మరో వైపు జాలరి పేటలో ఉండే డాన్ కరుణ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్రలో హరీష్ ఉత్తమన్ కనిపించారు. అలాంటి కరుణాకి రైట్ హ్యాండ్ కోటి పాత్రను కథానాయకుడు ఆనంద్ రవి పోషించారు. కరుణకి, కోటికి ఓ చిన్న గొడవ.. కోటి, మీనాక్షి ప్రేమికులు. కోటి ప్రేమ విషయం నచ్చని కరుణ అతనికి వారం రోజులు టైమ్ ఇచ్చి జాలరి పేటను విడిచిపోవాలని కండీషన్ పెడతాడు. అసలు పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు.. జాలరి పేట డాన్ కరుణ.. లవర్స్ కోటి – మీనాక్షి మధ్య నడిచే కథే ‘కొరమీను’.
మరి కరుణ ఇచ్చిన వార్నింగ్‌కి కోటి – మీనాక్షి భయపడ్డారా? మీసాల రాజు వీరి మధ్య ఏం చేశాడు అనే విషయం తెలియాలంటే కొరమీను సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఆనంద్ రవి హీరోగా నటిస్తోన్న కొరమీను చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. స్టోరీస్ ఆఫ్ ఇగోస్ అనే క్యాప్షన్ పెట్టారంటేనే సినిమా కథాంశమేంటో అర్థం చేసుకోవచ్చు. కొరమీను సినిమా ప్రారంభం నుంచి వైవిధ్యమైన ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచితే.. ఇప్పుడు అడివి శేష్ విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే క్యూరియాసిటీ అని అందరిలో పెరిగింది.
Also Read : ‘కొరమీను’ చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు – ఆనంద్ రవి