ఢాకా టెస్ట్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొనిముల్ హక్ 84 పరుగులతో రాణించాడు. ముషిఫిఖర్ రహీమ్-26; లిటన్ దాస్-25; నజ్మల్ శాంటో-24 రన్స్ చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ రెండు వికెట్లు సాధించారు. 73.5 ఓవర్లల్లోనే బంగ్లా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసిన బంగ్లా టీ విరామానికి ఐదు వికెట్లు కోల్పోయి 184 రన్స్ సాధించింది. ఆ తర్వాత మరో 16.5 ఓవర్లలో 43 పరుగులకు మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ ఒకే ఓవర్లో మోనిముల్, ఖలేద్ అహ్మద్ లను అవుట్ చేసి బంగ్లా ఇన్నింగ్స్ కు తెరదించాడు.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్ట పోకుండా 19పరుగులు సాధించింది. శుభ్ మన్ గిల్-14; కెఎల్ రాహుల్ -2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read : India Vs Bangladesh: కుల్దీప్ కు రెస్ట్- ఉనాడ్కత్ కు చోటు