టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్కడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్ల లను ఆ పార్టీ ఎంపీలు కలిశారు. పార్లమెంటులో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావుల నాయకత్వంలో కలిసి లేఖలు అందజేసి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,జోగినపల్లి సంతోష్ కుమార్,కే.ఆర్.సురేష్ రెడ్డి,లోకసభ సభ్యులు బీ.బీ.పాటిల్ తదితరులు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్,లోకసభ స్పీకర్ ఓంబిర్లాలను వారి ఛాంబర్లలో కలిసి ఈ మేరకు లేఖలు అందజేశారు.
Also Read : బీఆర్ఎస్ పార్టీ విస్తరణ నాందేడ్ రైతులతో ఇంద్రకరణ్