కొచ్చిలో నేడు ప్రారంభమైన ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు శామ్ కర్రన్, ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లకు జాక్ పాట్ తగిలింది. పంజాబ్ కింగ్స్ కర్రన్ ను 18.50 కోట్ల రూపాయలకు దక్కించుకోగా, గ్రీన్ ను ముంబై ఇండియన్స్ 17.50కోట్లకు, బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ 16.25కోట్లకు సొంతం చేసుకున్నాయి. నికోలస్ పూరన్ ను లక్నో సూపర్ జెయింట్స్ 16 కోట్ల రూపాయలకు పాడుకోవడం మరో ఆసక్తి కర విషయం. 14 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రేటు కర్రన్ కు దక్కడం విశేషం.
హ్యారీ బ్రూక్స్ ను హైదరాబాద్ 13.25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. మొన్నటి వరకూ పంజాబ్ కెప్టెన్ గా ఉన్న మయాంక్ అగర్వాల్ పై కూడా సన్ రైజర్స్ పెద్ద మొత్తం వెచ్చించి 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ ను గుజరాత్ జెయింట్స్ 2కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అజింక్యా రేహానేను చెన్నై సూపర్ కింగ్స్ 50లక్షలకు దక్కించుకుంది.