బంగ్లాదేశ్ తో ఢాకాలో జరుగుతోన్న రెండో టెస్టు లో ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వికెట్ నష్ట పోకుండా 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు రెండోరోజు ఆట ఇండియా మొదలు పెట్టింది. రిషభ్ పంత్ -93; శ్రేయాస్ అయ్యర్ -87 పరుగులతో రాణించారు. కోహ్లీ, పుజారా చెరో 24; గిల్ 20 పరుగులు చేయగలిగారు.
బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లామ్ చెరో నాలుగు వికెట్లు సాధించగా, తస్కిన్ అహ్మద్, మిరాజ్ హాసన్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 87 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్ట పోకుండా ఏడు పరుగులు (ఆరు ఓవర్లలో) చేసింది.