బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండు టెస్టు రసకందాయంలో పడింది. అవలీలగా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాల్సిన మ్యాచ్ లో ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయం కోసం 145 పరుగులు అవసరం కాగా నేడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్-7; శుభ్ మన్ గిల్-2; చతేశ్వర్ పుజారా-6; విరాట్ కోహ్లీ-1లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. అక్షర్ పటేల్ -26 ; జయ్ దేవ్ ఉనాద్కత్-3 పరుగులతో క్రీజులో ఉన్నారు. హసన్ మిరాజ్ మూడు వికెట్లతో ఇండియా టాపార్డర్ ను కుప్ప కూల్చాడు.
బంగ్లా తన రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లిట్టన్ దాస్-73; జాకీర్ హాసన్ -51; నురుల్ హాసన్-31; తక్సిన్ అహ్మద్-31 పరుగులతో రాణించారు. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు; అశ్విన్, సిరాజ్ చెరో రెండు; ఉమేష్, ఉనాద్కత్ చెరో వికెట్ పడగొట్టారు.
విజయానికి ఇండియా సరిగా 100 పరుగులు చేయాల్సి ఉంది. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో రాణించిన రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ల పైనే ఇండియా బ్యాటింగ్ భారం అంతా ఉంది.
Also Read : India Vs Bangla: ఇండియా 314 ఆలౌట్