రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను నేడు (గురువారంa0 ఓ ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల నుండి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. దీని విలువ 12,051 కోట్లు కాగా ఓపిఎంఎస్లో నమోదైన 11వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు. ఇప్పటివరకూ అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు నల్గొండలో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా అత్యల్పంగా అదిలాబాద్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొనసాగుతుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.