టీమిండియా క్రికెట్ ఆటగాడు రిషభ్ పంత్ ఛత్తీస్ గఢ్ లోని రూర్కే లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ కు బలంగా ఢీ కొట్టడంతో కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం గమనించిన రిషభ్ కారులోంచి దూకి తప్పించుకున్నాడు. కారు మంటల్లో దగ్ధమైంది. రిషభ్ ను మాక్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
న్యూ ఢిల్లీ నుంచి తన ఇంటికి వెళుతుండగా ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, వెంటనే రూర్కీ లోని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రికి తరలించామని ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ వెల్లడించారు.
పంత్ ముఖానికి గాయమైందని, అవసరమైన చికిత్సలు చేస్తున్నామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. కాగా, పంత్ త్వరగా కోలుకోవాలని సహచర ఆటగాళ్ళు, మాజీ ప్లేయర్లు, పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.