వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా ఇకపై ప్రతి నెలా రూ. 2,750 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. రేపు జనవరి 01, 2023 నుండి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయబోతోంది. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 03న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని పెంచిన పెన్షన్లను లాంఛనంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
దీంతోపాటు జులై 2022 నుండి నవంబర్ 2022 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ళపట్టాల పంపిణీ చేయనున్నారు.
పెన్షన్ కార్డులు:
ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య – 62,31,365
నేడు కొత్తగా పంపిణీ చేస్తున్నవి -2,31,989
మొత్తం కార్డుల సంఖ్య – 64,06,240
బియ్యం కార్డులు:
ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య – 1,45,43,996
నేడు కొత్తగా పంపిణీ చేస్తున్నవి – 44,543
మొత్తం కార్డుల సంఖ్య – 1,45,88,539
ఆరోగ్య శ్రీ కార్డులు:
ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య – 1,41,34,208
నేడు కొత్తగా పంపిణీ చేస్తున్నవి – 14,401
మొత్తం కార్డుల సంఖ్య – 1,41,48,249
ఇళ్ళ పట్టాలు:
ప్రస్తుతం ఉన్న పట్టాలు: 30,14,640
నేడు పంపిణీ చేస్తున్నవి- 14,531
మొత్తం లబ్ధిదారులు – 30,29,171
ప్రభుత్వం అందిస్తోన్న 64.06 లక్షల పెన్షన్లపై ఇకనుంచి ఏటా 21,180 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పెన్షన్లపై చేసిన మొత్తం ఖర్చు రూ. 62,500 కోట్లుగా ప్రకటించింది.