Saturday, November 23, 2024
HomeTrending Newsబీఆర్ఎస్ ప్రభావం ఉండదు - కొడాలి నాని

బీఆర్ఎస్ ప్రభావం ఉండదు – కొడాలి నాని

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని, కెసిఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్సార్సీపీ కి ఏ పార్టీతో పొత్తు ఉండదని, అంశాల వారీగా జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామని కొడాలి నాని స్పష్టం  చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావం, తదితర అంశాలపై వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు ఇస్తుందా? అనే మీడియా ప్రశ్నలకు కొడాలి సమాధానం ఇస్తూ..జాతీయ పార్టీలకు వైసీపీ అంశాలవారీగానే మద్దతు ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు అంటూనే అంశాలవారీగా మద్దతు ఉంటుంది అంటూ కొడాలి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు ఇస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై కొడాలి మాట్లాడుతూ..ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండకపోవచ్చు అన్నారు. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. అలాగే ఏపార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని కూడా అన్నారు. ఓ పక్క జాతీయ పార్టీలకు మద్దతు ఉంటుందంటూనే మరోపక్క వైసీపీకి ఎవరి పొత్తు అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ లో చేరేందుకు ఏపీలో కొంతమంది ఆసక్తి చూపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ IRTS అధికారి రావెల కిశోర్‌బాబుతో పాటు పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ త్వరలోనే ఏపీలో పర్యటించబోతున్నారని భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఏపీలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్