బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి‘. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లోనూ దూసుకెళుతుంది. దీంతో వీరసింహారెడ్డి మూవీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా మూవీ జనవరి 12న విడుదల కానుంది. అయితే.. ఈ మూవీ విషయంలో డైరెక్టర్ మలినేని గోపీచంద్ ఇప్పుడు టెన్షన్ ఫీలవుతున్నాడట.
మేటర్ ఏంటంటే.. ఈ మూవీ దాదాపు 3 గంటల రన్ టైమ్ ఉందట. ఈ సినిమా నుంచి 10 నిమిషాలు కట్ చేయాలి అనుకుంటున్నారట. నిజానికి కాస్త రన్ టైమ్ ఎక్కువైనప్పటికీ, సినిమాను అలానే ఉంచేయాలని అనుకున్నాడు గోపీచంద్. కానీ తన సినిమా 3 గంటలు ఉంటే కష్టమని బాలకృష్ణ ఫీల్ అయ్యారట. గతంలో కథానాయకుడు సినిమా రన్ టైమ్ 2 గంటల 51 నిమిషాలు. ఆ సినిమా ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. అందుకనే రన్ టైమ్ ను కుదించాలని డైరక్టర్ కు సూచించాడట బాలయ్య.
దీంతో గోపీచంద్ మలినేని 2 గంటల 50 నిమిషాలకు ఈ సినిమా రన్ టైమ్ ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఏమాత్రం కట్ చేయడం ఇష్టం లేని గోపీచంద్ కి రన్ టైమ్ తగ్గించమనడంతో టెన్షన్ ఫీలవుతున్నాడట. మరో వైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం.. ఇంకా ప్రమోషన్స్ లో స్పీడు పెంచాల్సి వుండడంతో గోపీచంద్ కాస్త ఒత్తిడికి లోనవుతున్నాడని తెలిసింది. మరి.. భారీ అంచనాలతో వస్తున్న వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో.. చూడాలి.