Sunday, November 24, 2024
HomeTrending NewsBRS కు తమిళనాడు నాడార్ సంఘాల మద్దతు

BRS కు తమిళనాడు నాడార్ సంఘాల మద్దతు

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న కెసిఆర్ కు తమిళనాడు నుంచి మద్దతు లభించింది. BRS కు మద్దతు తెలిసిన తమిళనాడు నాడార్ సంఘాలు, తెలంగాణ లో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమిళనాడు లో అమలు చేయాలని డిమాండ్ చేశాయి. తెలంగాణలో గౌడ, ఈడిగా కులస్తులకు అందించే సంక్షేమం , అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, తమిళనాడులో నాడార్ లను ఓటుబ్యాంక్ గానే ఉపయోగించుకుంటున్నారని నాడార్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా BRS పార్టీ విస్తరించాలని ఆకాంక్షను వెలిబుచ్చిన తమిళనాడు నాడార్ నేతలు, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్న మాదిరిగా కుల , చేతివృత్తులను తమిళనాడులో ప్రోత్సహించాలని కోరారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర తరహా పథకాలు అమలు కావాలన్నారు. త్వరలో చెన్నైలో జరిగే నాడార్ కులసంఘాల సమావేశంకు కెసిఆర్ రావాలని ఆహ్వానించిన ప్రతినిధులు, సీఎం కేసీఆర్ ని కలసి మద్దతు తెలిపేందుకు అవకాశం కల్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కోరారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేసిన తమిళనాడు రాష్ట్ర నాడార్ కుల సంఘాల ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా తమిళనాడు నాడార్ సంఘాల ప్రతినిధులను అభినందించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ .

ఈ కార్యక్రమంలో తమిళనాడు నాడార్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్నాల్డ్ అరసు, అల్ ఇండియా తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్తు రమేష్, అల్ ఇండియా తమిళనాడు నాడార్ సంఘం ఆర్గనైజర్, తమిళనాడు నాడార్ సంఘం ప్రధాన కార్యదర్శి బాల కృష్ణన్, తమిళ నాడు నాడార్ సంఘం కోశాధికారి జ్ఞాన గౌతమ పాండియన్, తమిళనాడు నాడార్ సంఘాల కోఆర్డినేటర్ శశికాంత్, నాడార్ సంఘం సమన్వయకర్త కడకరై కార్తీకన్, వీరాకుమార్, నాడార్ సంఘం అధ్యక్షులు, NDR ఫౌండేషన్ మహారాష్ట్ర అధ్యక్షుడు పువణేష్ నాడార్, తైవ కుమార్ నాడార్ తమిళనాడు సంఘం మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్