భారత ఆటగాళ్ళు హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ లు మలేషియా ఓపెన్-2023లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.
నేడు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో ప్రణయ్ తన ప్రత్యర్థి, ఇండోనేషియా ఆటగాడు చికో ఔరా పై 21-9; 15-21; 21-16 తేడాతో గెలుపొందాడు.
పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి లు 21-19; 22-20తేడాతో బగాస్ మౌలానా-ముహమ్మద్ సోహిబుల్ లపై విజయం సాధించారు.
కాగా, మహిళల డబుల్స్ మ్యాచ్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీ ఓటమి పాలయ్యారు. ఈ జంటపై బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయెవా- స్టెఫానీ స్టోయెవాలపై 21-13; 15-21; 21-17 తేడాతో విజయం సాధించారు.