Sunday, November 24, 2024
HomeTrending Newsవిశాఖ సదస్సులపై సిఎం సమీక్ష

విశాఖ సదస్సులపై సిఎం సమీక్ష

విశాఖ నగరంలో మార్చి నెలలో జరగనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సులకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మార్చి 3–4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ -2023,  మార్చి 28–29 మధ్య జీ-20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేషాలు జరగనున్నాయి. ఈ సదస్సుల ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం పలు కీలక సూచనలు చేశారు.

  • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ -2023 సదస్సు
  • 2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో గ్రౌండ్‌ అయిన పెట్టుబడులు ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు వచ్చాయన్న అధికారులు.
  • 2019–2022 మధ్య గ్రౌండ్‌ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడి.
  • 2019 నుంచి ఇప్పటివరకూ ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా, ఈ పెట్టుబడులన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని, వీటి ద్వారా 1,40,903 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతోందన్న అధికారులు.
  • వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని సిఎం సూచన
  • రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలి
  • కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలి
  • దీనికి గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలి , ఈ సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామన్న అధికారులు.
  • విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాని, వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సిఎం సూచన
  • అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేసి, వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలి

విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం సమీక్ష.

  • ప్రపంచదేశాల నుంచి హాజరు కానున్న 250 మంది ప్రతినిధులు.
  • ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరు.
  • అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరు.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు.
  • మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశం.
  • సమావేశంకోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం.
  • అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్న సీఎం.
  • ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్న సీఎం.
  • ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్నిరోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలన్న సీఎం.
  • ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.
  • ఏర్పాట్లుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
  • ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపిన అధికారులు.
  • ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా సుకోవాలన్న సీఎం.
  • ఆయా పర్యటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలన్న సీఎం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్